- పులివెందులలో వైసీపీకి షాక్
- టీడీపీలో చేరిన 20 వైసీపీ కుటుంబాలు
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీటెక్ రవి
స్థానిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అధినేత జగన్ సొంత గడ్డ పులివెందులకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ... టీడీపీ విధానాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో యువత పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, పులివెందులలోని ప్రతి వార్డులో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, మద్దతుదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో ఉన్న గీతా కుమారి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఈ చేరికలు జరగడం నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.