- ఈవీఎంలపై కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
- గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా మాట్లాడటం సరికాదని విమర్శ
- కొన్ని జాతీయ పార్టీల తీరు గొడ్డలి పార్టీ నేత తీరు ఒకలాగే ఉందని పరోక్ష వ్యాఖ్య
- గత పాలకుల తప్పులు సరిదిద్దడానికే మూడేళ్లు పట్టిందని వెల్లడి
- ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల తమది భయం కాదు బాధ్యత అని స్పష్టీకరణ
ఎన్నికల యంత్రాంగం, ఎస్ఐఆర్, ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అని, ఓడిపోయినప్పుడు మాత్రం వాటిపై నిందలు వేయడం ఆ పార్టీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా ఎన్నికల కమిషన్ ది ఎప్పుడూ ఒకే విధానం. సీఈసీ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరులు అనుసరిస్తున్నాయి. 'సర్'పై ఒకచోట ఒక వైఖరి, మరో చోట మరోవైఖరి అవలంభిస్తారా..? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా ఉన్నట్టు, అదే ఓటమి పాలైతే ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించడం సరైనదేనా? ఇది ఎక్కడి వైఖరి?" అని తీవ్రంగా ప్రశ్నించారు. ఇదే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని ఆ పార్టీలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేవలం కేంద్రంపై, రాష్ట్రాలపై బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలోని 'గొడ్డలి పార్టీ' నేత తీరు ఒకేలా ఉందని చంద్రబాబు పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం కొందరికి అలవాటైందని ఆయన దుయ్యబట్టారు. "ఒక వ్యక్తి వైఖరి వల్ల రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి? రప్పరప్పా రాజకీయాలు చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తారా? గతంలో రాజకీయాల్లోకి రౌడీలు వస్తే ప్రజలు గమనించేవారు, కానీ ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత పాలకులు చేసిన అవకతవకలను సరిదిద్దడానికే తమకు మూడేళ్ల సమయం పట్టిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నిర్మించాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగానే నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల తమకు ఉన్నది భయం కాదని, బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు.