- పొత్తు ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
- ఎన్డీఏ రెబల్ అభ్యర్థులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశం
- అభ్యర్థులను కాకుండా ఎన్డీఏను చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
పొత్తు ధర్మాన్ని ఎలాంటి పునరాలోచన లేకుండా పాటించాల్సిందేనని, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి ఎంతో శ్రమించి సీట్ల సర్దుబాటు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతలకు దీనిపై సానుకూల సందేశం పంపామని, కాబట్టి ఓటర్లు అభ్యర్థులను కాకుండా ఎన్డీఏ కూటమిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్చలో జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముగ్గురు నేతలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, కార్యకర్తల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు.
మంత్రులు కేవలం తమ నియోజకవర్గాలపైనే కాకుండా, వారికి ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాల బాధ్యతలను కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని తేల్చిచెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ, సొసైటీ ఎన్నికలు వస్తాయని, వాటికి ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని, ఆ తర్వాత ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.