ప్రముఖ సంగీత దర్శకుడు, యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, సన్ టీవీ నెట్‌వర్క్ డైరెక్టర్ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి వివాహ వేడుకల గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వస్తున్నాయి. వీరి పెళ్లి దేశంలోనే అత్యంత భారీ వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచిపోనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నవంబర్ 10, 11 తేదీలలో గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుంది. ఇది ఒక ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అనంతరం, నవంబర్ 21న చెన్నైలో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథుల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ప్రముఖులు హాజరుకానున్నారని అంచనా వేస్తున్నారు.

ఈ రిసెప్షన్‌కు హాజరయ్యే అతిథుల జాబితా అంచనాలను మరింత పెంచుతోంది. ఈ జాబితాలో ఉన్న కొందరు ముఖ్యులు:

రాజకీయ ప్రముఖులు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా

సినీ, సంగీత ప్రపంచం నుంచి:
సూపర్‌స్టార్ రజనీకాంత్
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్
లోకనాయకుడు కమల్ హాసన్
ధనుష్
అజిత్ కుమార్, షాలిని దంపతులు
అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు
శివకార్తికేయన్, ఆర్తి దంపతులు
డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్
ప్రసన్న, సూరజ్ వెంజరమూడు

ప్రత్యేక ఆహ్వాన పత్రిక
ఈ వివాహ ఆహ్వాన పత్రికను కూడా ఎంతో ప్రత్యేకంగా, కళాత్మకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. నీలం-తెలుపు రంగుల థీమ్‌తో, గ్రీస్ అందాలను గుర్తుచేసేలా చెక్క పెట్టెలో 3D ఎలిమెంట్స్‌తో దీన్ని రూపొందించారు. అతిథులు ఈ పత్రికను ఒక జ్ఞాపికగా దాచుకునేలా ఉండాలనే ఉద్దేశంతో వధూవరులిద్దరూ దగ్గరుండి దీనిని డిజైన్ చేయించుకున్నారని డిజైనర్ రంజని అయ్యంగార్ పేర్కొన్నారు.

'వై దిస్ కొలవెరి డి' పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనిరుధ్, 'జైలర్ 2' వంటి భారీ ప్రాజెక్టుతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు, కావ్య మారన్ తన తండ్రి కళానిధి మారన్ స్థాపించిన సన్ గ్రూప్ వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తూ, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు.