- విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా, ఏబీ వెంకటేశ్వరరావు
- నగరాభివృద్ధి కోసం ఏబీవీ సలహాలు తీసుకుంటానన్న వంగవీటి
- రాధాతో తనకు 20 ఏళ్ల నుంచి పరిచయం ఉందన్న ఏబీవీ
విజయవాడ నగర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యాలని కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా స్పష్టం చేశారు. నగరంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంత వాతావరణం కల్పిస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన ఏబీ వెంకటేశ్వరరావు అనుభవాన్ని గౌరవిస్తానని, నగరాభివృద్ధికి ఆయన ఇచ్చే మంచి సూచనలు తప్పక స్వీకరిస్తానని తెలిపారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయబోనని, విశ్వసనీయతకే కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
మరోవైపు, ఏబీ వెంకటేశ్వరరావు కూడా రాధాతో తనకు 20 ఏళ్ల పరిచయం ఉందని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయబోనని ప్రకటించారు. తమ మధ్య పోటీ రాజకీయపరమైనదే కానీ, వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఆత్మీయ పలకరింపు.. ఎన్నికల వాతావరణంలో హుందాతనాన్ని నింపింది. నవంబర్ 1న మేయర్ ఎన్నికకు పోలింగ్ జరగనుండగా, ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బెజవాడ మేయర్ పీఠం కోసం ఎన్డీయే కూటమి నుంచి వంగవీటి రాధా, వామపక్షాలు-కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మధ్య త్రిముఖ పోరు నెలకొన్న విషయం తెలిసిందే.