భారత అంతర్గత విషయాలు మీకెందుకు?: అమెరికన్ సింగర్కు అభిజిత్ దీప్కే కౌంటర్
- సీజేపీకి అమెరికా నుంచి నిధులు వస్తున్నాయన్న గాయని మేరీ మిల్బెన్
- ఆరోపణలను ఖండించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- మా అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యం ఎందుకని ఫైర్
- సీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని భారత యువతకు మిల్బెన్ పిలుపు
- గతంలోనూ సీజేపీ నిధులపై వచ్చిన ఆరోపణలు, దీప్కే వివరణ
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి అమెరికాలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకుల నుంచి నిధులు అందుతున్నాయంటూ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. భారతీయులను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికన్ల మద్దతు ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.
భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశీ పౌరులకు ఎవరిచ్చారని అభిజిత్ దీప్కే నిలదీశారు. "మా దేశ సమస్యలను మేమే పరిష్కరించుకోగలం. మా వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం అవసరం లేదు" అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.
అంతకుముందు మేరీ మిల్బెన్ 'ఎక్స్' వేదికగా అభిజీత్ దీప్కే, సీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. "ప్రధాని మోదీకి, ఆయన నాయకత్వంలో దేశ భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఉన్న అమెరికా డోనర్లు సీజేపీకి నిధులు సమకూరుస్తున్నారు" అని ఆమె ఆరోపించారు. సీజేపీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని భారత యువతకు ఆమె పిలుపునిచ్చారు. "భారత గడ్డపై పుట్టి, పెరిగి, చదువుకున్న వారు దేశ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడేందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది" అని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయవాద నాయకులను లక్ష్యంగా చేసుకునేందుకు ఒక పద్ధతిని అనుసరిస్తారని, అందులో భాగంగానే అమెరికాలో చదువుకున్న వారిని గుర్తించి, వారిలో తీవ్రవాద భావజాలం నింపి, తిరిగి వారి దేశానికి పంపి, గందరగోళం సృష్టించేందుకు నిధులు ఇస్తారని మిల్బెన్ ఆరోపించారు.