నిరసనల రోజు రైళ్లు ఆపలేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన ఢిల్లీ మెట్రో
మొత్తం 303 స్టేషన్లలో 57 మాత్రమే మూసివేసినట్లు వెల్లడి
షెడ్యూల్ ప్రకారం 4,157 ట్రిప్పులు నడిపినట్లు స్పష్టం
సేవల కోత వల్ల కాదని, నిరసనల కారణంగానే ప్రయాణికులు తగ్గారని వివరణ
85 శాతం నెట్వర్క్ యథావిధిగా పనిచేసిందని వెల్లడి

ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నిరసనల నేపథ్యంలో అక్టోబర్ 10న రైళ్ల సేవలను రద్దు చేయలేదని, ఎలాంటి సేవలల్లో ఎలాంటి కోత విధించలేదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) స్పష్టం చేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేసినప్పటికీ, మెట్రో కార్యకలాపాల పరిమాణంలో ఎలాంటి తగ్గింపు లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది.
ఎన్డీటీవీకి లభించిన ఈ రిప్లై కాపీ ప్రకారం, అక్టోబర్ 10న స్టాండర్డ్ శనివారం షెడ్యూల్ ప్రకారమే 271 రైళ్లను సేవల్లోకి ప్రవేశపెట్టామని డీఎంఆర్సీ తెలిపింది. నెట్వర్క్ అంతటా పూర్తిస్థాయిలో 4,157 ట్రిప్పులు నడిపామని పేర్కొంది. మొత్తం 303 స్టేషన్లకు గాను, కేవలం 57 స్టేషన్లలో మాత్రమే ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించింది. అంటే, 85 శాతం నెట్వర్క్ యథావిధిగా పనిచేసిందని స్పష్టం చేసింది.
పరిమిత స్టేషన్లలోనే ఆంక్షలు విధించామని, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు మూసివేసిన స్టేషన్ల సమీపంలో ఇతర స్టేషన్లు తెరిచే ఉన్నాయని డీఎంఆర్సీ ఛైర్పర్సన్ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. 45 ఇంటర్ఛేంజ్ స్టేషన్లలో 14 స్టేషన్లలో సేవలు నిరంతరాయంగా కొనసాగాయని తెలిపారు. కోర్టు జోక్యం తర్వాత ప్రభావిత స్టేషన్ల సంఖ్యను పునఃసమీక్షించి తగ్గించినట్లు కూడా పేర్కొన్నారు.
అక్టోబర్ 10న కేవలం 32 లక్షల మంది మాత్రమే మెట్రోలో ప్రయాణించారని, సాధారణంగా ప్రభుత్వ సెలవుదినమైన రెండో శనివారం నాడు ప్రయాణికుల సంఖ్య దాదాపు 58 లక్షలుగా ఉంటుందని డీఎంఆర్సీ తెలిపింది. నిరసనల కారణంగానే చాలా మంది ప్రయాణాలు మానుకున్నారని, అందుకే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అభిప్రాయపడింది.