సొంత పార్టీ సీఎంకు రాహుల్‌ గాంధీ ఇచ్చే గౌరవం ఇదేనా?.. డీకే తోపులాటపై బీజేపీ సెటైర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత పార్టీ సీఎంకు రాహుల్‌ గాంధీ ఇచ్చే గౌరవం ఇదేనా?.. డీకే తోపులాటపై బీజేపీ సెటైర్లు!

Is this the respect Rahul Gandhi gives to his own party CM BJP satires on DK pushing incident
  • ఢిల్లీ నిరసనలో సీఎం శివకుమార్‌కు ఎదురైన తోపులాట
  • రాహుల్‌ భద్రతా సిబ్బంది ఆయనను పక్కకు నెట్టినట్లు ఆరోపణలు
  • ఘటనపై కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ
  • అధిష్ఠానం వద్ద శివకుమార్‌కు గౌరవం ఉందా? అని ప్రశ్న
  • భద్రతా విధుల్లో భాగంగానే తోపులాట జరిగిందని పరమేశ్వర వివరణ
ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన ర్యాలీలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు ఎదురైన చేదు అనుభవంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ భద్రతా సిబ్బంది శివకుమార్‌ను పక్కకు నెట్టిన ఘటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నాయకత్వంపై ప్రశ్నలు సంధించింది. సొంత పార్టీ ముఖ్యమంత్రికే ఆ పార్టీలో గౌరవం దక్కడం లేదని ఎద్దేవా చేసింది.

బీజేపీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన శివకుమార్‌.. కెటిల్‌ నుంచి వెలువడిన ఆవిరిలా మాయమయ్యారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి రాహుల్‌ గాంధీ ఇచ్చే గౌరవం ఇదేనా? మర్యాద లేదు.. పట్టింపు లేదు.. కాంగ్రెస్‌ శైలిలో అవమానించడమేనని విమర్శించింది.

కన్నడిగుల ఆత్మగౌరవం ఎక్కడ?
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర కూడా ఈ ఘటనపై స్పందించారు. రాష్ట్రంలో ఏమైనా మాట్లాడుకోవచ్చని, కానీ పార్టీ అధిష్ఠానం వద్ద ఎంత గౌరవం దక్కుతుందో ప్రపంచానికే తెలుసంటూ శివకుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి శివకుమార్‌ ఎంత అవసరమో తమకు సంబంధం లేదన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కన్నడిగుడికి అవమానం జరిగితే అది కన్నడిగుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ విషయంలో అధిష్ఠానానికి తన ఆత్మగౌరవం గురించి చెప్పే ధైర్యం శివకుమార్‌కు ఉందా? అని ప్రశ్నించారు.

భద్రతా విధుల్లో భాగమే: పరమేశ్వర
మరోవైపు, ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర స్పందించారు. నిరసనలు, భారీ జనసమూహాల సమయంలో భద్రతా ఏర్పాట్లను నిర్వహించడం కష్టమని చెప్పారు. గతంలో తాను పాల్గొన్న నిరసనల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు.

రాహుల్‌ గాంధీ భద్రత చూసే సిబ్బందికి ఆయనకు రక్షణ కల్పించడమే ప్రధాన బాధ్యతని పరమేశ్వర వివరించారు. అనుమతి లేని వ్యక్తులు ఆయన వద్దకు రాకుండా చూడటం భద్రతా విధానంలో భాగమన్నారు. అదే సమయంలో సీఎం శివకుమార్‌ అక్కడికి రావడంతో జనసందోహంలో ఆయనను కొంతమేర పక్కకు నెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రోటోకాల్‌ ప్రకారం ప్రత్యేక గౌరవం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది తాము రక్షించాల్సిన వ్యక్తి భద్రతకే ప్రాధాన్యమిస్తారని స్పష్టం చేశారు.
Advertisement
DK Shivakumar
Rahul Gandhi
BJP
Congress Protest
Karnataka CM
BY Vijayendra

More Telugu News