రాహుల్ గాంధీ నన్ను తోసేశారు: గర్భిణీ జర్నలిస్ట్ సంచలన ఆరోపణ

రాహుల్ గాంధీ నన్ను తోసేశారు: గర్భిణీ జర్నలిస్ట్ సంచలన ఆరోపణ

Rahul Gandhi pushed me Pregnant journalists sensational allegation
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడు నెలల గర్భిణి రిచా పరాశర్
  • ఇది బీజేపీ ప్రచారమంటూ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్
  • రాహుల్‌పై మండిపడిన బీజేపీ నేతలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఒక మహిళా జర్నలిస్ట్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సమీపంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాహుల్ తన చేయి పట్టుకుని లాగి, తోసేశారని ఆమె ఆరోపించారు. మూడు నెలల గర్భిణి అయిన జర్నలిస్ట్ రిచా పరాశర్ ఈ ఘటన తర్వాత ఆసుపత్రిలో చేరారు. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇదంతా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఇండియా కూటమి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నుంచి సౌండ్‌బైట్ తీసుకునేందుకు ప్రయత్నించానని రిచా తెలిపారు. ఆ సమయంలో రాహుల్ తన చేయి పట్టుకుని దూకుడుగా లాగారని, వెంటనే ఆయన బాడీగార్డులు కూడా తోసేయడంతో మెట్లపై పడిపోయానని ఆమె వాపోయారు. తన కెమెరామెన్‌ను కూడా తోయడంతో అతను తనపై పడ్డాడని వివరించారు.

ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి రిచాను పరామర్శించారు. రాహుల్ తీరుపై కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి మండిపడ్డారు. మరోవైపు, కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. జర్నలిస్ట్ ఆసుపత్రిలో చేరిన సమయం, గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్స్‌రే తీయడం వంటి అంశాలపై ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. ఇది బీజేపీ ఆడిస్తున్న నాటకమని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Advertisement
Rahul Gandhi
Richa Parashar
Pregnant journalist allegation
India bloc protest Delhi
Congress BJP row
Journalist manhandling row

More Telugu News