అరెస్ట్‌ను ముందే ఊహించి... వీడియో విడుదల చేసిన అభిజీత్ దీప్కే
- ఢిల్లీ విమానంలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ డిప్కే అరెస్ట్
- జంతర్ మంతర్ నిరసనకు ముందే అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అరెస్ట్‌ను ఊహించి ముందుగానే వీడియో రికార్డ్ చేసిన దీప్కే
- తన తర్వాత నిరసనకు ఎవరు నాయకత్వం వహిస్తారో ప్రకటించిన వైనం
- ఇది నియంతృత్వమంటూ పోలీసుల చర్యపై దీప్కే ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలో నేడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సహా ముగ్గురు నేతలను, వారు ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు కొన్ని గంటల ముందే ఈ ఘటన జరిగింది.
ముంబై నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన అభిజీత్ దీప్కే, పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రంకాలను విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మహిళా అధికారులతో కూడిన ఢిల్లీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా విమానంలోనే దీప్కే పోలీసుల చర్యను తీవ్రంగా నిరసించారు.
తాను అరెస్టుకు సిద్ధపడే వచ్చానని, ఎవరికీ భయపడబోనని పోలీసులకు సవాల్ విసిరారు. ఈ పరిణామాలను నియంతృత్వంగా అభివర్ణించిన ఆయన, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కూడా ఇలా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి లేనందున, ముందస్తు జాగ్రత్తగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. తమ నేతలు నిరసన ప్రదేశానికి చేరుకోకుండా అడ్డుకోవడానికే పోలీసులు ఈ నిర్బంధాలకు పాల్పడ్డారని సీజేపీ ఆరోపించింది.
అయితే, తన అరెస్ట్‌ను ముందుగానే ఊహించిన అభిజీత్ దీప్కే నిన్న రాత్రే ఒక వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. తమ లీడర్లు పోలీసుల అదుపులోకి వెళ్లిన వెంటనే సీజేపీ ఆ వీడియోను విడుదల చేసింది.
"మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నాతో పాటు సౌరవ్, అశుతోశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అర్థం. మా గైర్హాజరీలో పార్టీ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ అజింక్య షిండే జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. కార్యకర్తలంతా ఆయనకు మద్దతుగా నిలవాలి" అని దీప్కే ఆ వీడియోలో తన మద్దతుదారులను కోరారు.