భారత్‌కు ఒక నీతి.. అమెరికాకు మరో నీతా? ట్రంప్ డీజిల్ ఒప్పందంపై విమర్శలు!
- రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు ట్రంప్ అంగీకారం
- రష్యా డీజిల్ లావాదేవీలపై ఆంక్షలను సడలించిన అమెరికా
- భారత్‌పై సుంకాల వైఖరిని గుర్తుచేస్తూ అమెరికాలో విమర్శలు
- రష్యాకు ఆదాయం పెరుగుతుందని అమెరికా సెనేటర్ల అభ్యంతరం
- ఇంధన ధరలు తగ్గించేందుకే ఈ నిర్ణయమని ట్రంప్ సమర్థన
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై సుంకాల విషయంలో ఒత్తిడి తెచ్చిన అమెరికా.. ఇప్పుడు అదే దేశం నుంచి డీజిల్ తెప్పించుకోవడానికి సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోనే విమర్శలకు దారితీసింది. భారత్ విషయంలో ఒకలా, తన విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రశ్నిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, ప్రపంచ మార్కెట్లకు భారీ మొత్తంలో డీజిల్ సరఫరా చేసేందుకు అంగీకరించారని ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా డీజిల్ లావాదేవీలపై కొన్ని ఆంక్షలను అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలికంగా సడలించింది. అయితే, రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు వీలు కల్పించే చట్టంపై ట్రంప్ సంతకం చేసిన కొన్ని వారాలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
అమెరికాపై సొంత దేశంలోనే విమర్శలు
అమెరికా జర్నలిస్టు క్యాథరిన్ రాంపెల్ ఈ నిర్ణయంలోని వైరుధ్యాన్ని ప్రశ్నించారు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా తనపైనా సుంకాలు విధించుకుంటుందా? అంటూ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.
రాజకీయ జర్నలిస్టు సామ్ స్టెయిన్ కూడా ట్రంప్ వైఖరిని ప్రస్తావించారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన ఆంక్షల చట్టంపై ఇటీవలే సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. రష్యా చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని గతంలో అమెరికా విమర్శించిందని పలువురు గుర్తుచేస్తున్నారు. మరి రష్యా నుంచి అమెరికా ఇంధనం కొనుగోలు చేస్తే అదే సూత్రం వర్తించదా? అని ప్రశ్నిస్తున్నారు.
అమెరికా సెనేటర్ల అభ్యంతరం
రష్యా డీజిల్ విక్రయాలకు ఆరు నెలలపాటు అనుమతించడాన్ని డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు జీన్ షహీన్, చక్ షుమర్, ఎలిజబెత్ వారెన్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆదాయాన్ని పెంచుతుందని, మాస్కోపై ఒత్తిడి తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా చమురు రవాణా నౌకలు, ఆర్థిక వ్యవస్థలు, సైనిక సాంకేతికత సరఫరాదారులపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని గతంలోనూ అమెరికా చట్టసభ సభ్యులు కోరారు.
ధరలు తగ్గించేందుకే: ట్రంప్
అమెరికాలో ఇంధన ధరలను తగ్గించేందుకే రష్యా నుంచి అదనపు డీజిల్ తెప్పించుకుంటున్నామని ట్రంప్ సమర్థించుకున్నారు. వినియోగదారులు, రైతులు, ట్రక్కుల యజమానులకు ఇంధనం అందుబాటులో ఉండాలంటే ఈ సరఫరాలు అవసరమని చెప్పారు.
ట్రంప్ ప్రకటన ప్రకారం.. రష్యా తొలుత 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ సరఫరా చేయనుంది. నవంబరులో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత 10 లక్షల టన్నులు అందించనుంది. తదుపరి సరఫరాలు రిఫైనరీల సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. రష్యా నుంచి వచ్చే డీజిల్‌కు సంబంధించి నిర్దిష్ట లావాదేవీలను 2027 ఏప్రిల్ వరకు అనుమతిస్తూ అమెరికా ఆర్థిక శాఖ జనరల్ లైసెన్స్ 135 జారీ చేసింది.
మరోవైపు, రష్యాకు అదనపు ఇంధన ఆదాయం అందించడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం పెరుగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.