అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. ‘ప్రధాని అంబానీ గారూ’ అంటూ ట్వీట్
Add ap7am to your home Screen

అంబానీపై ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు.. ‘ప్రధాని అంబానీ గారూ’ అంటూ ట్వీట్

Elon Musks sarcastic remarks on Ambani calls him Prime Minister Ambani in tweet
  • స్టార్‌లింక్ అనుమతిలో జాప్యంపై అంబానీని టార్గెట్ చేసిన మస్క్
  • ‘ప్రధాని అంబానీ గారూ’ అంటూ ఎక్స్‌లో సంచలన పోస్ట్
  • శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో అంబానీ గుత్తాధిపత్యం కోరుకుంటున్నారని ఆరోపణ
  • ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అంగీకరించబోమని కేంద్రం స్పష్టీకరణ
  • విపత్తుల సమయంలో స్టార్‌లింక్ సేవలు ఉపయోగపడతాయన్న మస్క్
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. భారత్‌లో 'స్టార్‌లింక్' శాటిలైట్ ఇంటర్నెట్ సేవల అనుమతుల్లో జాప్యంపై మస్క్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో ముఖేశ్ అంబానీ గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనను ఉద్దేశించి ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అంటూ మస్క్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మస్క్ తన 'ఎక్స్' ఖాతాలో స్పందిస్తూ.. "భారతదేశానికి అసలైన బాస్ మీరేనని గుర్తించనందుకు క్షమించండి, గౌరవనీయ 'ప్రధాని' అంబానీ గారూ. భారతదేశం వంటి గొప్ప దేశ ప్రజలను దోచుకునేలా మీ గుత్తాధిపత్యం కొనసాగాలని మీరు ఆశించడం సహజమే. అయితే, భారత్‌లో స్టార్‌లింక్ పోటీ పడటానికి మీరు అనుమతిస్తారా?" అని సవాల్ విసిరారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదని, స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

కాగా, కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల మాట్లాడుతూ.. దేశంలో ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం అంగీకరించదని, ఇప్పటికే మూడు సంస్థలకు లైసెన్సులు మంజూరు చేశామని స్పష్టం చేశారు. సింధియా వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే మస్క్ ఈ స్థాయిలో విరుచుకుపడటం గమనార్హం. ప్రభుత్వంపై అత్యంత పలుకుబడి ఉన్న కొందరు సంపన్న వ్యక్తులు స్టార్‌లింక్ రాకను అడ్డుకుంటున్నారని, అంబానీయే దేశానికి ‘అసలైన బాస్’ అని మస్క్ గతంలోనూ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Advertisement
Elon Musk
Mukesh Ambani
Starlink India
Satellite Internet
Reliance Jio
Jyotiraditya Scindia

More Telugu News