నందిగ్రామ్‌లో బీజేపీ రికార్డు విజయం.. 1.22 లక్షల ఓట్ల భారీ మెజారిటీ!
Add ap7am to your home Screen

నందిగ్రామ్‌లో బీజేపీ రికార్డు విజయం.. 1.22 లక్షల ఓట్ల భారీ మెజారిటీ!

BJP record victory in Nandigram with a massive majority of 1-22 lakh votes
  • హసిరాణి రథ్‌కు 1,64,427 ఓట్లు
  • కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు 41,674 ఓట్లు
  • మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీకి దూరం
  • సువేందు అధికారి నందిగ్రామ్‌ను వదులుకోవడంతో ఉపఎన్నిక
  • ఈ ఫలితంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి హసిరాణి రథ్‌ ఏకంగా 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1967 నుంచి నందిగ్రామ్‌లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీల్లో ఇదే అత్యధికం. ఈ ఫలితంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

హసిరాణి రథ్‌కు 1,64,427 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు 41,674 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. సీపీఐ అభ్యర్థి శాంతి గోపాల్‌ గిరికి 5,779 ఓట్లు వచ్చాయి. ఆలిండియా సెక్యులర్‌ ఫ్రంట్‌ అభ్యర్థి అలీ మహమ్మద్‌ సబీర్‌ మీరాజ్‌ ఖాన్‌ 1,607 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌కు కేవలం 853 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి సంచిత ప్రధాన్‌ డే చివరి నిమిషంలో నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

నందిగ్రామ్‌లో గతంలో అత్యధిక మెజారిటీ రికార్డు ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి పేరిట ఉండేది. 2016లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 81,230 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి బీజేపీ అభ్యర్థి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారని తాను ముందే అంచనా వేసినట్లు సువేందు అధికారి తెలిపారు. మైనారిటీ ఓట్లలోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతు లభించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి సువేందు అధికారి కేవలం 9,665 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే, భవానీపూర్‌ స్థానం నుంచి కూడా గెలిచిన ఆయన నందిగ్రామ్‌ను వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హసిరాణి రథ్‌.. సువేందు అధికారి మాజీ వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ రథ్‌ తల్లి. చంద్రనాథ్‌ ఈ ఏడాది మే 6న మాధ్యమ్‌గ్రామ్‌లో హత్యకు గురయ్యారు.
Advertisement
Hasirani Rath
Nandigram Bypoll Results
West Bengal BJP Victory
Suvendu Adhikari
Nandigram Assembly Election
West Bengal Politics

More Telugu News