‘అమెరికా మనల్ని వద్దనుకుంటోంది.. తిరిగొచ్చేయండి’: భారత టెక్కీలకు శ్రీధర్ వెంబు పిలుపు
- భారతీయ టెక్కీలు స్వదేశానికి రావాలని శ్రీధర్ వెంబు పిలుపు
- అమెరికా భారతీయులను కోరుకోవడం లేదని వెంబు వ్యాఖ్య
- అమెరికా సాంకేతిక అభివృద్ధిలో భారతీయులు ఎంతో కీలక పాత్ర పోషించారని వెల్లడి
- భారత్‌కు తిరిగొచ్చి దేశ భవిష్యత్తును నిర్మించాలని వెంబు సూచన
- పలు ఐటీ సంస్థలను పీఈఆర్‌ఎం కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసిన అమెరికా
అమెరికాలో గ్రీన్‌కార్డుల ప్రక్రియకు సంబంధించి భారతీయ ఐటీ కంపెనీలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలు స్వదేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. అమెరికా సాంకేతిక అభివృద్ధిలో భారతీయులు ఎంతో కీలక పాత్ర పోషించారని, అయినా అక్కడి ప్రజల్లో మెజారిటీ వర్గం ఇప్పుడు భారతీయులను కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. భారత్‌కు తిరిగొచ్చి దేశ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములు కావాలని సూచించారు.
అమెరికాలో వీసాలపై పనిచేస్తున్న భారతీయులు ఎంతో కష్టపడి నిర్మించుకున్న జీవితాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావడం బాధాకరమని వెంబు పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని కొత్త భవిష్యత్తుకు నాందిగా చూడాలని అన్నారు. ‘తిరిగి రండి.. మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పిలుపునిచ్చారు.
అమెరికా కార్మిక శాఖ ఇటీవల పలు భారతీయ ఐటీ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీలను ప్రోగ్రాం ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్ మెంట్ (పీఈఆర్‌ఎం) ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌తో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అమెరికాలో కంపెనీల ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియలో కీలకమైనది.
విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా నియమించుకునే ముందు సంబంధిత ఉద్యోగానికి అర్హులైన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. అయితే, ఈ సంస్థలు పీఈఆర్‌ఎం విధానాన్ని దుర్వినియోగం చేశాయని అమెరికా కార్మిక శాఖ ఆరోపించింది. కొత్త దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపైనా ముందుకు వెళ్లబోమని కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సాండర్లింగ్ ప్రకటించారు.
ఈ సస్పెన్షన్ కారణంగా ప్రభావిత సంస్థలు కొత్త పీఈఆర్‌ఎం దరఖాస్తులు దాఖలు చేయలేవు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా నిలిచిపోతాయి. అయితే, దీనివల్ల హెచ్-1బీ వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావు. ఆ వీసాలపై ఉద్యోగులను నియమించుకోవడంపైనా నేరుగా నిషేధం విధించినట్లు కాదు.
భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని వెంబు పిలుపునివ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలోనూ అమెరికా గ్రీన్‌కార్డు విధానంలో మార్పుల నేపథ్యంలో వీసాలపై అక్కడ పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి రావాలని కోరారు. తాజాగా ఐటీ కంపెనీలపై చర్యల నేపథ్యంలో ఆయన మరోసారి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.