కులగణనపై కేంద్రానికి ఓబీసీల అల్టిమేటం.. పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరిక
- రాబోయే జనగణనలో ఓబీసీ కులగణన కాలమ్ చేర్చాలని డిమాండ్
- డిసెంబర్ 14, 15 తేదీల్లో పార్లమెంట్ ముట్టడికి ఓబీసీ సంఘాల పిలుపు
- డిమాండ్ నెరవేర్చకపోతే జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరిక
- ఢిల్లీలో సమావేశమైన 22 రాష్ట్రాల ఓబీసీ, అఖిలపక్ష నేతలు
రాబోయే జనగణనలో ఓబీసీల కులాల వారీ వివరాల సేకరణ కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి బీసీ, ఓబీసీ సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం దిగిరాకుంటే డిసెంబర్లో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జాతీయ స్థాయి ఓబీసీ నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో, డిసెంబర్ 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా వేలాది మందితో 'చలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడించాలని తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ద్వారా జనగణనను బహిష్కరించేలా పిలుపునిస్తామని నేతలు స్పష్టం చేశారు.
కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట మార్చడం గర్హనీయమని, బీసీలను మోసం చేస్తే మరో స్వాతంత్ర్య సంగ్రామం తప్పదని నేతలు హెచ్చరించారు. ప్రస్తుత తరుణంలో బీసీల గణన జరగకపోతే, భవిష్యత్తులో అది ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, ఎంపీ పప్పు యాదవ్, మాజీ ఎంపీలు వి. హనుమంతరావు, రాజేష్ సైన్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్ రావుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, 22 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.