కోహ్లీ అంటే నానా పటేకర్‌కు ఎంత అభిమానమో.. వైరల్‌ అవుతున్న పాత వీడియో!
Add ap7am to your home Screen

కోహ్లీ అంటే నానా పటేకర్‌కు ఎంత అభిమానమో.. వైరల్‌ అవుతున్న పాత వీడియో!

Nana Patekar love for Kohli viral old video
  • విరాట్‌ త్వరగా ఔటేతే భోజనం చేయాలనిపించదని చెప్పిన నానా
  • కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన పటేకర్‌
  • అతడు అద్భుతమైన ఆటగాడంటూ గతంలో ఓ సందర్భంలో ప్రశంస
  • పటేకర్ మరణంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పాత వీడియో
  • ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్న క్రీడా లోకం
ప్రముఖ నటుడు నానా పటేకర్‌ మరణంతో సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ సమయంలో ఆయనకు భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీపై ఉన్న అభిమానం తెలిపే పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విరాట్‌ త్వరగా ఔటైతే తనకు భోజనం చేయాలనిపించదని నానా పటేకర్‌ ఆ వీడియోలో చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో నానా పటేకర్‌ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ అంటే నాకు చాలా ఇష్టం. అతడు ఒక అద్భుతమైన ఆటగాడు. విరాట్‌ త్వరగా ఔటైతే నాకు భోజనం చేయాలనిపించదు’’ అని చెప్పినట్లు కనిపిస్తోంది. దీంతో క్రికెట్‌పై, ముఖ్యంగా విరాట్‌ కోహ్లీపై ఆయనకు ఉన్న అభిమానం ఎంతలా ఉందో అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

నానా పటేకర్‌ మృతిపై పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ఆయనను ప్రత్యేక ప్రతిభ ఉన్న నటుడిగా అభివర్ణించారు. నానా పటేకర్‌ చేసిన పనులు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో నివాళులు అర్పించారు.

మాజీ భారత బ్యాటర్‌ అజింక్య రహానే కూడా నానా పటేకర్‌ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన అద్భుతమైన నటుడని, ఎన్నో తరాలను తన నటనతో అలరించారని గుర్తు చేసుకున్నారు.

1978లో వచ్చిన ‘గమన్‌’ సినిమాతో నటుడిగా నానా పటేకర్‌ కెరీర్‌ ప్రారంభమైంది. ‘పరిం‍దా’, ‘అగ్నిసాక్షి’ వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో ఆకట్టుకున్న ఆయన.. ‘వెల్‌కమ్‌’లో తన కామెడీ టైమింగ్‌తోనూ ప్రేక్షకులను అలరించారు.

ఇటీవలి కాలంలోనూ నానా పటేకర్‌ పలు సినిమాల్లో కనిపించారు. ‘హౌస్‌ఫుల్‌ 5’లో నటించిన ఆయన.. షాహిద్‌ కపూర్‌, తృప్తి డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ’రోమియో’లో పోలీస్‌ అధికారిగా కనిపించారు. అనిల్‌ కపూర్‌, రాధికా మదన్‌ నటించిన ‘సుబేదార్‌’లోనూ అతిథి పాత్రలో కనిపించారు.
Advertisement
Nana Patekar
Virat Kohli
Nana Patekar death
Bollywood
Shikhar Dhawan
Nana Patekar viral video

More Telugu News