బార్ల యజమానులకు నష్టం లేదు.. వినియోగదారులపై స్వల్ప భారం: మంత్రి జూపల్లి

బార్ల యజమానులకు నష్టం లేదు.. వినియోగదారులపై స్వల్ప భారం: మంత్రి జూపల్లి

Jupally Krishna Rao says no loss to bar owners only slight burden on consumers
  • ప్రివిలేజ్ ఫీజుతో బార్ల యజమానులకు నష్టం లేదన్న మంత్రి జూపల్లి
  • వినియోగదారులపై పడేది స్వల్ప భారమేనని స్పష్టీకరణ
  • బీఆర్ఎస్ హయాంలో మద్యం ఆదాయం 260 శాతం పెరిగిందని వెల్లడి
రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన ప్రివిలేజ్ ఫీజు వల్ల బార్ల యజమానులకు ఎలాంటి నష్టం జరగదని, వినియోగదారులపై మాత్రమే స్వల్ప భారం పడుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మద్యం ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందే తప్ప, వినియోగం పెద్దగా తగ్గదని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరం అప్‌గ్రేడ్ అయినందున, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగానే ఇక్కడా బార్ లైసెన్సులను జారీ చేశామని తెలిపారు. ఈ కొత్త రుసుము బార్ యాజమాన్యాలకు నష్టం కలిగించేది కాదని ఆయన పునరుద్ఘాటించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.10,000 కోట్ల నుంచి రూ.36,000 కోట్లకు, అంటే దాదాపు 260 శాతం పెరిగిందని జూపల్లి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ఆదాయం ప్రస్తుతం రూ.40,000 కోట్లుగా ఉందని వివరించారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు వెళుతోందని, మద్యం ఉత్పత్తికి నీటి కొరత ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Jupally Krishna Rao
Telangana Excise Department
Bar Privilege Fee
Bars and Restaurants Association
Telangana Liquor Revenue
Telangana Government

More Telugu News