రక్షణ రంగంలో స్వదేశీ సత్తా.. విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్
- విశాఖలో ఫ్లీట్ సపోర్ట్ షిప్-1ను జలప్రవేశం చేయించిన కేంద్ర మంత్రి
- హెచ్ఎస్ఎల్‌లో ఐదో నౌక నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త స్లిప్‌వే ప్రారంభం
- యుద్ధనౌకలకు సముద్రంలోనే ఇంధనం అందించనున్న భారీ నౌకలు
- శక్తి ఇంజిన్ల రెండో ప్రొడక్షన్ లైన్‌తో ధ్రువ్, ప్రచండ్ హెలికాప్టర్ల ఉత్పత్తికి ఊతం
రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా మరో కీలక ఘట్టం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఇక్కడి హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ని లాంఛనంగా జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి సంజీవ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
భారత నౌకాదళం కోసం మొత్తం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను హెచ్ఎస్ఎల్ నిర్మిస్తుండగా, ఇది వాటిలో మొదటిది. కేవలం 18 నెలల వ్యవధిలోనే స్టీల్ కటింగ్ దశ నుంచి జలప్రవేశం స్థాయికి చేరుకోవడం విశేషం. సుమారు 43,500 టన్నుల బరువుండే ఈ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసేందుకు వీలుగా యుద్ధనౌకలకు సముద్రంలోనే ఇంధనం, ఆహారం, ఇతర సామగ్రిని అందిస్తాయి. దీంతో నౌకాదళ కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఇదే కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-5) నిర్మాణానికి కీల్ లేయింగ్ (శంకుస్థాపన) చేశారు.
అనంతరం హెచ్ఎస్ఎల్‌లో ఆధునికీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల సామర్థ్యం గల గోలియత్ క్రేన్‌ను కూడా రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ నూతన సౌకర్యాలతో 45,000 డీడబ్ల్యూటీ వరకు బరువున్న అతిపెద్ద నౌకలను నిర్మించే సామర్థ్యం హెచ్ఎస్ఎల్‌కు లభిస్తుంది.
ఒడిశాలో 2,000వ ఏరో-ఇంజిన్ మైలురాయి
విశాఖ పర్యటన అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ ఒడిశాలోని కోరాపుట్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ హెచ్ఏఎల్ తయారుచేసిన 2,000వ ఏరో-ఇంజిన్‌ను అందించే మైలురాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు హెచ్ఏఎల్ కోరాపుట్ అందిస్తున్న సేవలకు ఇది గుర్తుగా నిలవనుంది. రూ. 218 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న 'శక్తి' ఇంజిన్ల రెండో ఉత్పత్తి విభాగాన్ని కూడా ఈ సందర్భంగా హైలైట్ చేయనున్నారు. ఈ కొత్త లైన్ ద్వారా ధ్రువ్, ప్రచండ్ వంటి స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తి అవసరాలు తీరనున్నాయి. రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి వాటిని స్వయంగా డిజైన్ చేసి, తయారుచేసే స్థాయికి భారత్‌ను చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ కార్యక్రమాలు నిదర్శనమని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.