కష్టమైన దశ దాటేశారు.. ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో ఇక దూకుడే!
- ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు
- క్లిష్టమైన షియర్ జోన్‌ను అధిగమించిన కార్మికులు
- సొరంగం పనులు 79 శాతం పూర్తి
- ఐదు నెలల్లో 700 మీటర్ల తవ్వకాలు
- 2028 జూన్ నాటికి నీటి విడుదల లక్ష్యం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో కీలక ముందడుగు పడింది. తవ్వకాలకు తీవ్ర ఆటంకంగా మారిన క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాన్ని అధిగమించారు. దీంతో పనుల వేగం పెంచేందుకు మార్గం సుగమమైంది. అదనపు యంత్రాలను అందుబాటులోకి తెచ్చి పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2028 జూన్ నాటికి సొరంగం ద్వారా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ సహా కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సొరంగం పూర్తయితే కరవు పీడిత ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీరు అందనుంది.
సొరంగం మొత్తం పొడవు 43.968 కిలోమీటర్లు కాగా, ఇప్పటివరకు 79 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. గత ఐదు, ఆరు నెలల్లో ఇన్‌లెట్, ఔట్‌లెట్ మార్గాల్లో కలిపి సుమారు 700 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. అత్యంత క్లిష్టమైన షియర్ జోన్‌ను దాటడం ఈ పురోగతిలో కీలకమని మంత్రి పేర్కొన్నారు.
సొరంగం తవ్వకాల సమయంలో గతేడాది ఫిబ్రవరిలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బలహీనమైన భూభాగం, రాళ్లు విరిగిపడే ప్రమాదాలున్న చోట ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. 140 మిల్లీమీటర్ల మందం కలిగిన పైపులతో రక్షణ కవచం ఏర్పాటు చేసి తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం రోజుకు సగటున ఏడు నుంచి ఏడున్నర మీటర్ల మేర తవ్వకాలు జరుగుతున్నాయి. ఔట్‌లెట్ వద్ద మూడు చేతుల డ్రిల్లింగ్ యంత్రం పనిచేస్తుండగా, అక్టోబరులో ఇన్‌లెట్ వద్ద మరో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. జర్మనీ నుంచి తెప్పిస్తున్న ప్రత్యేక రైలు ఈ నెలాఖరుకు చేరుకోనుంది. దీంతో సొరంగం లోపల తవ్విన మట్టిని, రాళ్లను వేగంగా బయటకు తరలించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఒక విడత తవ్వకాల పనులు పూర్తి కావడానికి 20 నుంచి 24 గంటలు పడుతోంది. కొత్త యంత్రాలు, మెరుగైన రవాణా సదుపాయాలతో ఈ సమయాన్ని పది గంటలకు తగ్గించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబరు చివరి నుంచి పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు.