ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ కొనుగోలు చేసి ప్రయాణించిన తెలంగాణ మంత్రులు
Advertisement

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ కొనుగోలు చేసి ప్రయాణించిన తెలంగాణ మంత్రులు

Telangana Ministers Travel by Purchasing RTC-Metro Common Pass
  • డే పాస్‌తో ఆర్టీసీ బస్సు, మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రులు
  • బస్సులో బేగంపేట మెట్రోకు చేరుకున్న మంత్రులు
  • జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు మెట్రో రైలులో ప్రయాణం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పలువురు మంత్రులతో కలిసి ఈరోజు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ రవాణాను మరింత సులభతరం చేయడం కోసం ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో దీనిని ఆటోలు, క్యాబ్‌లకు అనుసంధానించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

శనివారం డే పాస్‌తో మంత్రులతో కలిసి ఆయన ఆర్టీసీ బస్సులో బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా తనతో పాటు ప్రయాణించిన మంత్రులకు, భట్టి విక్రమార్క కాంబో పాస్ కొనుగోలు చేశారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ప్రజా రవాణా వైపు ప్రయాణికులను ఆకర్షితులను చేయడం కోసం ఈ పాస్ తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రస్తుతం వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని తెలిపారు. కాంబో పాస్‌పై ప్రయాణించిన మంత్రుల్లో వివేక్, అజారుద్దీన్ తదితరులు ఉన్నారు.


     
Advertisement
Mallu Bhatti Vikramarka
RTC Metro Common Pass
Telangana Ministers Metro Travel
Hyderabad Public Transport

More Telugu News