ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ దేశంలోనే టాప్!
- సెప్టెంబర్‌లో 9 శాతం వృద్ధి నమోదు చేసిన భాగ్యనగరం
- ముంబై, ఢిల్లీ నగరాల్లో 6 శాతం మేర తగ్గిన నియామకాలు
- ఏఐ, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో అత్యధికంగా పెరిగిన అవకాశాలు
- అనుభవజ్ఞులకే కంపెనీల మొగ్గు, ఫ్రెషర్లకు స్వల్ప వృద్ధి
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల కంటే 'వైట్ కాలర్' (ఆఫీస్) ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘నౌకరి.కామ్’ విడుదల చేసిన తాజా 'జాబ్‌స్పీక్' నివేదిక ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నియామకాలు 9 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో జాతీయస్థాయిలో నియామకాల వృద్ధి కేవలం 2 శాతంగానే నమోదవడం గమనార్హం.
నౌకరి నివేదిక ప్రకారం, హైదరాబాద్ (9%) తర్వాత చెన్నై (6%), బెంగళూరు (4%), కోల్‌కతా (4%) నగరాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. పుణెలో నియామకాలు స్థిరంగా కొనసాగుతుండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్‌సీఆర్)లో ఉద్యోగ అవకాశాలు 6 శాతం మేర క్షీణించాయి.
రంగాల వారీగా విశ్లేషిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) విభాగాల్లో అత్యధికంగా 20 శాతం వృద్ధి నమోదైంది. పండుగల సీజన్ డిమాండ్, ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం 11 శాతం వృద్ధిని సాధించింది. అయితే, ఐటీ-సాఫ్ట్‌వేర్ (-4%), ఫార్మా (-4%), హాస్పిటాలిటీ (-11%), విద్యా రంగం (-18%) వంటి కీలక రంగాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుత నియామకాల్లో కంపెనీలు అనుభవజ్ఞులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. 13-16 ఏళ్ల మధ్య అనుభవం ఉన్నవారికి డిమాండ్ 7 శాతం పెరగ్గా, ఫ్రెషర్ల నియామకాలు కేవలం ఒక శాతం మాత్రమే వృద్ధి చెందాయి. ఇక 4-7 ఏళ్ల అనుభవం ఉన్న మిడ్-లెవల్ విభాగంలో నియమకాలు 2 శాతం మేర క్షీణించాయి.