రైలులో కన్ఫర్మ్ టికెట్ కావాలా? చార్ట్ తయారయ్యాక కూడా ఛాన్స్!
Advertisement

రైలులో కన్ఫర్మ్ టికెట్ కావాలా? చార్ట్ తయారయ్యాక కూడా ఛాన్స్!

Indian Railways Confirmed Train Ticket After Chart Preparation
  • చార్ట్ తయారయ్యాక కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం
  • కరెంట్ బుకింగ్ ద్వారా ఖాళీ బెర్తుల కేటాయింపు
  • ఈ సదుపాయంలో వెయిటింగ్, ఆర్ఏసీ టికెట్లు ఉండవు
  • మొదటి చార్ట్ తర్వాతే ఈ బుకింగ్ ఓపెన్ అవుతుంది
రైల్వే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్తే. రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్తులు అందుబాటులో ఉంటే, 'కరెంట్ బుకింగ్' సదుపాయం ద్వారా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారైన వెంటనే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోదని ఓ సీనియర్ రైల్వే అధికారి పేర్కొన్నారు. టిక్కెట్ల రద్దు లేదా ఇతర సర్దుబాట్ల కారణంగా చార్ట్ తయారీ అనంతరం ఖాళీగా మిగిలిన బెర్తులను కరెంట్ బుకింగ్ కింద కేటాయిస్తారు. ఈ విధానంలో కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ చేస్తారని, ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.

ఐఆర్‌సీటీసీ మార్గదర్శకాల ప్రకారం, కరెంట్ బుకింగ్ సదుపాయం సాధారణ ప్రయాణికులతో పాటు ఏజెంట్లకూ అందుబాటులో ఉంటుంది. ఇందులో కేవలం ఈ-టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. సీనియర్ సిటిజన్, దివ్యాంగులకు వర్తించే రాయితీలు ఈ టిక్కెట్లపై కూడా వర్తిస్తాయి. అయితే, కరెంట్ బుకింగ్ టికెట్లపై బోర్డింగ్ పాయింట్, ప్రయాణికుడి పేరు, వయసు లేదా జెండర్ వంటి వివరాల మార్పులకు అవకాశం ఉండదు. ప్రీమియం, సువిధ రైళ్లలో చివరిగా బుక్ అయిన టికెట్ ధరలే వీటికి వర్తిస్తాయి.

ఇటీవల రైల్వే శాఖ చార్ట్ తయారీ సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 5:01 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు, ముందు రోజు రాత్రి 8:00 గంటలకే మొదటి చార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. మిగిలిన రైళ్లకు కనీసం 10 గంటల ముందు చార్ట్ తయారవుతుంది. ఇక తుది చార్ట్‌ను రైలు బయలుదేరడానికి సుమారు 30 నిమిషాల ముందు సిద్ధం చేస్తారు. కావున, మొదటి చార్ట్ తయారీతో బుకింగ్ ముగిసిందని భావించకుండా, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను నేరుగా తనిఖీ చేసుకోవడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Indian Railways
IRCTC Current Booking
Confirmed Train Tickets
Railway Chart Preparation
Online Train Ticket Booking

More Telugu News