తల్లిపాలు తాగేవారు మనుషులు, బిర్యానీ తినేవారు జంతువులు: హిమంత బిశ్వశర్మ

తల్లిపాలు తాగేవారు మనుషులు, బిర్యానీ తినేవారు జంతువులు: హిమంత బిశ్వశర్మ

Himanta Biswa Sarma says those who drink breast milk are humans and those who eat biryani are animals
  • నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుసేన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు
  • దేవుడు తనను బిర్యానీ తినడానికే పంపాడన్న హుసేన్ వ్యాఖ్యలకు హిమంత కౌంటర్
  • అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి ఆహార పదార్థాలపై నేతల మధ్య వ్యక్తిగత దూషణలు 
అస్సాం రాజకీయాలు మరోసారి వ్యక్తిగత దూషణలతో వేడెక్కాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుసేన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. "తల్లిపాలు తాగడానికి పుట్టినవారు మనుషులు.. బిర్యానీ తినడానికి జన్మించినవారు జంతువులు" అంటూ హిమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జురియాలో జరిగిన సభలో హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం, హిమంత బిశ్వశర్మ.. రకీబుల్ హుసేన్‌ను పురాణాల్లోని బకాసురుడితో పోలుస్తూ ప్రభుత్వ నిధులను మింగేస్తున్నారని ఆరోపించారు. దీనికి హుసేన్ స్పందిస్తూ, "భగవంతుడు నన్ను బిర్యానీ తినడానికే ఈ భూమి మీదకు పంపాడు" అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనే ఉటంకిస్తూ హిమంత పైవిధంగా తీవ్రంగా ప్రతిస్పందించారు.

ఈ ఆహార సంబంధిత వాగ్వివాదం సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. హుసేన్ పులావ్, మాంసం తినే అలవాట్లను ప్రస్తావిస్తూ హిమంత "బకాసురుడు" అని పోల్చారు. దీనికి హుసేన్ కూడా గట్టిగానే బదులిచ్చారు. "హిమంత బిస్కెట్లు తింటూ పెరిగారు. కాంగ్రెస్‌లో చేరాకే ఆయనకు పులావ్, చికెన్ తెలిశాయి" అంటూ ఎదురుదాడి చేశారు.

నాగావ్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 6న ఉప ఎన్నిక జరగనుండగా, 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల ప్రచారంలో హిమంత కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ పార్టీలపైనా విమర్శలు గుప్పించారు. రూపోహిహాట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నూరుల్ హుదా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్ అజ్మల్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. 
Advertisement
Himanta Biswa Sarma
Rakibul Hussain
Assam Politics
Nagaon Lok Sabha By Election
Congress vs BJP Assam
Biryani Controversy

More Telugu News