'సర్'లో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు: తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్
- 65 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇచ్చారని వెల్లడి
- ఖైరతాబాద్ నియోజకవర్గంలో 80 వేల మందికి నోటీసులు ఇచ్చామన్న సుదర్శన్ రెడ్డి
- సర్ ప్రక్రియను పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 80 వేల మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వారిలో 20 శాతం మంది సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 92 లక్షల మందిలో 65 లక్షల మంది నోటీసులపై స్పందించినట్లు చెప్పారు.
నోటీసులు అందిన వారి ఇళ్ల వద్దకు బీఎల్ఓలు వెళ్లి సంబంధిత పత్రాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నోటీసులు అందిన కుటుంబ సభ్యులు అందరూ అందుబాటులో ఉండవల్సిన అవసరం లేదని, ఒక్కరు ఉండి, మిగిలిన అందరి కుటుంబ సభ్యుల వివరాలు ఇస్తే సరిపోతుందని అన్నారు. సర్ ప్రక్రియను మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.