కరెంట్ బిల్లుతో ట్రాఫిక్ చలాన్ల లింక్ లేదు: సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో కీలక స్పష్టత
- ట్రాఫిక్ చలాన్లను కరెంట్ బిల్లుతో లింక్ చేయాలని ఆదేశించలేదన్న సుప్రీంకోర్టు
- బకాయిల వసూలుకు పలు కఠిన చర్యలు సూచించిన ధర్మాసనం
- చలాన్లు పెండింగ్‌లో ఉంటే వాహనం అమ్మకం, ఆర్‌సీ రెన్యువల్ బంద్
- అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేసిన కోర్టు
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఈ-చలాన్ల బకాయిలను విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేయాలనే వార్తలపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. విచారణ సందర్భంగా ఈ అంశాన్ని కేవలం నోటి మాటగా ప్రస్తావించామే తప్ప, గురువారం వెల్లడించిన తుది ఉత్తర్వుల్లో అలాంటి ఆదేశాలేవీ లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా పేరుకుపోయిన చలాన్ల బకాయిల వసూలుకు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఇకపై చలాన్లు పెండింగ్‌లో ఉంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) రెన్యువల్ లేదా డూప్లికేట్ పత్రాల జారీని నిలిపివేయాలి. వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) ధ్రువీకరణ పత్రాలను కూడా జారీ చేయకూడదు. బకాయిలున్న వాహనాలను పరివహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని, దీనివల్ల సదరు వాహనాల విక్రయం లేదా యాజమాన్య బదిలీ సాధ్యం కాదని కోర్టు పేర్కొంది.
బకాయిలు చెల్లించని వాహనాలను తనిఖీల్లో గుర్తించి, అవసరమైతే వాటిని సీజ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్సులను రెన్యువల్ చేయవద్దని, ఇప్పటికే ఉన్న లైసెన్సులను సస్పెండ్ చేయాలని సూచించింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, వాటి ద్వారా విధించిన జరిమానాలను సమర్థంగా వసూలు చేయడంపై దృష్టి సారించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు రూ.49,194.05 కోట్ల విలువైన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు రూ.26,175.05 కోట్లు మాత్రమే వసూలయ్యాయని కోర్టు దృష్టికి వచ్చింది. మోటారు వాహన చట్టం, 1988 నిబంధనల అమలుపై దాదాపు 14 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.