ప్రేమను నిరాకరించిందని.. శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సహోద్యోగి దాడి
Advertisement

ప్రేమను నిరాకరించిందని.. శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సహోద్యోగి దాడి

Colleague attacks software employee in Shamshabad for rejecting love
  • విమానాశ్రయం నుంచి కారులో కిడ్నాప్ చేసిన సహోద్యోగి
  • మార్గమధ్యలో చితకబాది కిందకు తోసేసిన వైనం
  • గతంలోనే వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. ప్రేమను నిరాకరించిందన్న నెపంతో ఓ యువకుడు, తన సహోద్యోగి అయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై దాడికి తెగబడ్డాడు. శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఝార్ఖండ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి మాదాపూర్‌లో నివసిస్తూ, నగరంలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో పనిచేసే ఆకాశ్ అనే యువకుడు గత ఏడాది కాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు గతంలోనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పట్లో అతను వెనక్కి తగ్గాడు.

ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బంధువుల ఇంటి నుంచి విమానంలో తిరిగి వస్తున్న ఆమెను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆకాశ్ అడ్డగించాడు. ఆమెను బెదిరించి బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ వైపు తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహించిన ఆకాశ్, యువతిపై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం ఆమెను కారులో నుంచి కిందకు నెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు ఆకాశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Akash
Shamshabad Airport
Hyderabad Software Employee Attack
Software Engineer Assault Case

More Telugu News