గాంధీ జయంతి: అక్టోబర్ 2న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు బంద్
Advertisement

గాంధీ జయంతి: అక్టోబర్ 2న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు బంద్

Gandhi Jayanti Meat shops closed in Hyderabad on October 2
  • జీహెచ్ఎంసీ పరిధిలో వర్తించనున్న అధికారిక ఆదేశాలు
  • వధశాలలు, రిటైల్ మాంసం దుకాణాలపై పూర్తి నిషేధం
  • నిబంధనల కఠిన అమలుకు పోలీసుల సహకారం కోరిన జీహెచ్ఎంసీ
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని 2026 అక్టోబర్ 2న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని మాంసం విక్రయశాలలు, వధశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలతో పాటు అన్ని రకాల రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను అక్టోబర్ 2న పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 533(బి) ప్రకారం, స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు తమ సిబ్బందికి సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను జీహెచ్ఎంసీ కోరింది.
Advertisement
Gandhi Jayanti
GHMC
Hyderabad meat shops closed
RV Karnan
Slaughterhouses closure

More Telugu News