ఆసియా క్రీడల్లో ఆర్చర్ చికితకు ఒకేరోజు రెండు స్వర్ణాలు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసియా క్రీడల్లో ఆర్చర్ చికితకు ఒకేరోజు రెండు స్వర్ణాలు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందన

Archer Chikitha wins two gold medals in Asian Games CM Revanth Reddy congratulates
  • ఆసియా క్రీడల్లో తెలంగాణ ఆర్చర్ చికితకు రెండు స్వర్ణాలు
  • చికితను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంస
  • ఈ విజయంతో 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన చికిత
  • పెద్దపల్లి జిల్లాకు చెందిన క్రీడాకారిణి చికిత
ఆసియా క్రీడల్లో ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటిన తెలంగాణ ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితా రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తన అద్భుత విజయంతో చికిత తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని కొనియాడారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేస్తూ, చికిత పట్టుదల, నిరంతర సాధన, దృఢ సంకల్పం యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఆమె ప్రతిభను గుర్తించి వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత.. ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఉమెన్స్ టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా, మిక్స్‌డ్ టీమ్‌లో తన భాగస్వామి సాహిల్ జాదవ్‌తో కలిసి సాధించిన ఈ విజయంతో ఆమె 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం. ఈ విజయం తెలంగాణ క్రీడా రంగంలో నూతనోత్సాహాన్ని నింపింది.
Advertisement
Chikitha Rao
Revanth Reddy
Asian Games Archery
Telangana Gold Medalist
Los Angeles Olympics 2028
Indian Archery Team

More Telugu News