వీల్‍చైర్‌పై తల్లిని తోసుకుంటూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన యువకుడు.. ఎందుకంటే?
Advertisement

వీల్‍చైర్‌పై తల్లిని తోసుకుంటూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన యువకుడు.. ఎందుకంటే?

Young man takes mother on wheelchair to MLA house over hospital negligence
  • ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆగ్రహం
  • తల్లిని వీల్‍చైర్‌పై ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కొడుకు
  • మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో 5 గంటలపాటు చికిత్స అందించలేదని ఆరోపణ
  • అర్ధరాత్రి 2 కిలోమీటర్ల దూరం వీల్‍చైర్‌పై తల్లిని తోసుకుంటూ వెళ్లిన యువకుడు
  • ఎమ్మెల్యే సిబ్బంది జోక్యంతో స్పందించిన ఆసుపత్రి అధికారులు
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఓ కుమారుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి గంటల తరబడి వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ, ఆమెను వీల్‍చైర్‌పైనే తోసుకుంటూ అర్ధరాత్రి వేళ స్థానిక ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్య రాజ్‍కుమార్ తన తల్లి భూక్య బుజ్జి (55)ని మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆమె ఆరోగ్యం విషమించడంతో అత్యవసర చికిత్స కోసం ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే, ఆసుపత్రికి వచ్చిన సుమారు ఐదు గంటల వరకు కనీసం బెడ్ కూడా కేటాయించకుండా, తన తల్లిని వీల్‍చైర్‌కే పరిమితం చేశారని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. చికిత్స అందించాలని ఎంత వేడుకున్నా సిబ్బంది స్పందించలేదని, పైగా దీనిపై ప్రశ్నించినందుకు తనపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించాడు.

వైద్యుల తీరుతో తీవ్ర నిరాశకు గురైన రాజ్‍కుమార్, దిక్కుతోచని స్థితిలో తన తల్లిని అదే వీల్‌చైర్‌పై సుమారు 2 కిలోమీటర్ల దూరం తోసుకుంటూ అర్ధరాత్రి వేళ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు నివాసానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పటికీ, అక్కడి సిబ్బంది రాజ్‍కుమార్‌తో మాట్లాడి వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీధర్, బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తల్లి, కుమారుడిని తిరిగి ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.
Advertisement
Bhukya Rajkumar
Mancherial Government Hospital
Medical Negligence
MLA Kokkirala Premsagar Rao

More Telugu News