మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావు.. పల్లాకు బాలకోటయ్య ఫిర్యాదు
- టీచర్‌పై కర్రతో దాడి చేశారని కొలికపూడిపై ఫిర్యాదు
- క్రమశిక్షణ చర్యకు డిమాండ్ చేసిన బాలకోటయ్య
- ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఒక పీఈటీ టీచర్‌ను ఇంటికి పిలిపించి, దుర్భాషలాడటమే కాకుండా కర్రతో దాడి చేశారంటూ ఆయనపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య... టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న మేరుగు రమేశ్‌ను సెప్టెంబర్ 25న సాయంత్రం 6.30 గంటలకు డిప్యూటీ డీఈవో ద్వారా ఎమ్మెల్యే తన నివాసానికి పిలిపించుకున్నారు. అదే సమయంలో పాఠశాల హెడ్మిస్ట్రెస్ శోభలతను కూడా పిలిపించి దుర్భాషలాడినట్టు ఫిర్యాదులో తెలిపారు. అనంతరం టీచర్ రమేశ్‌పై కర్రతో దాడి చేశారని ఆరోపించారు.
పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించకుండా, స్థానిక టీడీపీ నేత గోటేటి సుబ్రహ్మణ్యంను పిలవడమే ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమని బాలకోటయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనతో బాధితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని తెలిపారు. అందువల్ల పార్టీపరంగా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే కొలికపూడి వాదన మరోలా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఎమ్మెల్యే ప్రవర్తనపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చిన విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.