45 లక్షల కట్నం.. బంగారం.. అయినా వరకట్న వేధింపులు.. నవ వధువు బలి
Advertisement

45 లక్షల కట్నం.. బంగారం.. అయినా వరకట్న వేధింపులు.. నవ వధువు బలి

Vaishnavi Omkar Gisre dies by suicide as 45 lakh dowry and gold was not enough
  • పెళ్లయిన నాలుగు నెలలకే పూణేలో టెక్కీ ఆత్మహత్య
  • కట్నం వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • కారు కొనేందుకు అదనంగా రూ.5 లక్షలు తేవాలని ఒత్తిడి
  • భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు
పూణేలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే ఓ మహిళా ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు తీవ్రంగా వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలోని వడాచివాడి ప్రాంతంలో వైష్ణవి ఓంకార్ గిస్రే (24) తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. గురువారం రాత్రి ఆమె తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పురందర్ తాలూకాకు చెందిన ఆమె తండ్రి ప్రవీణ్ రఘునాథ్ జరండే (51) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... వైష్ణవికి, ఓంకార్ సంజయ్ గిస్రే (28)తో ఈ ఏడాది మే 9న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు రూ.45 లక్షలు ఖర్చు చేయడంతో పాటు 116.64 గ్రాములు బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. కారు కొనేందుకు తల్లిదండ్రుల నుంచి రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త, అత్తింటివారు ఒత్తిడి చేయడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణవి భర్త ఓంకార్ గిస్రే, మామ సంజయ్ మహాదేవ్ గిస్రే (49), అత్త రూపాలి సంజయ్ గిస్రే (42)లపై వరకట్న వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించారన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Advertisement
Vaishnavi Omkar Gisre
Pune IT engineer suicide
Dowry harassment case Pune
Omkar Sanjay Gisre
Wadachiwadi suicide incident
Pune dowry death investigation

More Telugu News