అమెరికా మోజులో విషాదం: ఇథియోపియాలో ముగ్గురు గుజరాతీల కిడ్నాప్
- అక్రమంగా అమెరికా వెళ్తూ ఇథియోపియాలో కిడ్నాప్
- ఏజెంట్‌కు రూ.2 కోట్లకు పైగా చెల్లింపు
- కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు
- తమ వారిని కాపాడాలంటూ ప్రభుత్వానికి కుటుంబసభ్యుల వేడుకోలు
అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాలనే కల ముగ్గురు గుజరాతీ బంధువుల పాలిట పీడకలగా మారింది. 'డంకీ రూట్'లో అమెరికాకు బయలుదేరిన వీరిని ఇథియోపియాలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వారిని విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు చెల్లించాలని కుటుంబసభ్యులను డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళనతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
మెహ్‌సానా జిల్లాకు చెందిన రుత్విక్ జాన్‌సారి, అహ్మదాబాద్‌లో నివసించే మమతా చావ్డా, గాంధీనగర్‌కు చెందిన మయూరి.. ఈ ముగ్గురూ బంధువులు. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు వీరు ఒక ఏజెంట్‌ను ఆశ్రయించారు. సెప్టెంబర్ 20న గుజరాత్ నుంచి బయలుదేరి జైపూర్, అబుదాబి మీదుగా ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా చేరుకున్నారు. అక్కడి ఒక గెస్ట్‌హౌస్‌లో ఉన్న వీరితో సెప్టెంబర్ 22 నుంచి సంబంధాలు తెగిపోయాయి.
ఏజెంట్ అల్పేష్ పంచాల్‌కు ఒక్కొక్కరు రూ.60 నుంచి 75 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.2 కోట్లకు పైగా ముట్టజెప్పిన తర్వాతే వారు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే, ఇథియోపియా చేరుకున్నాక 'ఖాన్' అనే వ్యక్తి ఫోన్ చేసి, కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి.
"మేము ఇప్పటికే ఏజెంట్‌కు భారీ మొత్తంలో చెల్లించాం. మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. దయచేసి మా పిల్లలను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలి" అని మమత తండ్రి కిరీట్‌భాయ్ చౌహాన్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రుత్విక్ తాత కానుభాయ్ జాన్‌సారి కూడా ఇదే విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెహ్‌సానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాంగ శాఖ చొరవ తీసుకుని తమ వారిని కాపాడాలని కుటుంబాలు కోరుతున్నాయి.