డిజిటల్ బుక్‌లో రాశాం.. ఆ అధికారులను వదలం: పిన్నెల్లి హెచ్చరిక
Advertisement

డిజిటల్ బుక్‌లో రాశాం.. ఆ అధికారులను వదలం: పిన్నెల్లి హెచ్చరిక

Pinnelli Ramakrishna Reddy warns officials names recorded in digital book
  • గురజాలలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
  • తప్పులు చేసిన అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేశామన్న పిన్నెల్లి
  • రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న వైవీ సుబ్బారెడ్డి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసిన అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేశామని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

పల్నాడు జిల్లా గురజాలలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పిన్నెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిన్నెల్లి మాట్లాడుతూ.. కొందరు అధికారుల పేర్లతో తాము జాబితా సిద్ధం చేశామని, వారిని వదిలిపెట్టబోమని అన్నారు.

ఇదే సమావేశంలో మాట్లాడిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
Advertisement
Pinnelli Ramakrishna Reddy
Macherla MLA
YSRCP
YV Subba Reddy
Palnadu
Digital Book Warning

More Telugu News