వైసీపీ నేత కాకుమాను కుటుంబానికి జగన్ పరామర్శ
- ఇటీవల కన్నుమూసిన వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్
- ఒంగోలులో కాకుమాను నివాసానికి వెళ్లిన జగన్
- కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా
వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల మరణించిన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఒంగోలులోని రాజశేఖర్ నివాసానికి వెళ్లిన జగన్, ఆయన కుటుంబ సభ్యులను కలిసి సానుభూతిని తెలియజేశారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
కాగా, విజయవాడలో సెప్టెంబర్ 21న డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసనలో జరిగిన తోపులాట అనంతరం రాజశేఖర్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. రాజశేఖర్ గతంలో లిడ్‍క్యాప్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.