ఆర్చరీలో అదరగొట్టిన అమ్మాయిలు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఏడో గోల్డ్
- ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణం గెలిచిన భారత్
- ప్రపంచ రికార్డును సమం చేసిన భారత ఆర్చర్లు
- పతకాల పట్టికలో 9వ స్థానానికి చేరిన భారత్
ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో చైనా జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు గోల్డ్ మెడల్ గెలవడమే కాకుండా, దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా సమం చేసి సంచలనం సృష్టించింది.
ఈ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 53కి చేరింది. ఇందులో 7 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలు ఉన్నాయి. ఫలితంగా పతకాల పట్టికలో భారత్ టాప్ 10లోకి ప్రవేశించి, ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
అథ్లెటిక్స్ ఈవెంట్లు ముగియడంతో ఇక అందరి దృష్టి రెజ్లర్లు, బాక్సర్లు, ఆర్చర్లపై నిలిచింది. మరోవైపు, భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో స్థానం కోసం సెమీస్‌లో దక్షిణ కొరియాతో కీలక మ్యాచ్ ఆడనుంది. స్టార్ జూడోకా అస్మితా దేవ్ కూడా బరిలోకి దిగుతుండగా, నిన్న మహిళల ట్రాప్ విభాగంలో స్వర్ణం గెలిచిన నీరూ ధండా నేడు మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్, టీమ్ ఈవెంట్లలో పోటీపడనుంది.