పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్
- సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పేర్లు ఖరారు
- ఇప్పటికే ప్రారంభమైన ఓటర్ల నమోదు ప్రక్రియ
- అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలన్న కేటీఆర్
తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సామ రామ్మోహన్ రెడ్డిని, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు మంగళవారం రాత్రి వెల్లడించింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ పేర్లను ఆమోదించారని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2027 మార్చిలో ఖాళీ అవుతున్న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ఈ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి కోరారు. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేసి కనీసం మూడేళ్లు దాటిన వారు ఓటు హక్కు నమోదుకు అర్హులు. గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం హైదరాబాద్‌లో తన ఓటును నమోదు చేసుకున్నారు. అర్హులైన పట్టభద్రులందరూ నవంబర్ 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను, డిసెంబర్ 30న తుది జాబితాను ప్రచురించనున్నారు.