కేటీఆర్‌కు సిరిసిల్లలో రేపు సినిమా చూపిస్తాం: చామల కిరణ్ కుమార్ రెడ్డి
- రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ భూ బాగోతాలు బయటపెడతారన్న చామల
- సీఎంను సవాల్ చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని చామల విమర్శ
- ప్రధాన ప్రాజెక్టులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు అసలైన సినిమా చూపిస్తామని, ఆ రోజును ఆయన జీవితంలో మర్చిపోలేరని హెచ్చరించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనకు రాకముందే తనపై ఉన్న ఆరోపణలను బయటపెట్టాలని కేటీఆర్ సవాల్ చేయడంపై చామల తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిని సవాల్ చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని, ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. సిరిసిల్ల ప్రజల ముందే కేటీఆర్ భూ బాగోతాలను రేవంత్ బయటపెడతారని, ఆయన అసలు స్వరూపం దేశమంతటికీ తెలుస్తుందని అన్నారు.
గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లలో నిజమైన అభివృద్ధి జరగలేదని, కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. చిన్న వర్షానికే కలెక్టరేట్ భవనంలోకి వెళ్లలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లలో రూ.175 కోట్ల రైతు రుణమాఫీ అమలు చేసిందని, సీఎం పర్యటనలో రూ.345.75 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, నేతన్నల కోసం ప్రత్యేక బజార్ వంటి పనులను వివరించారు. మెట్రో, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు.