మనుషులకు ప్రాణాంతకం.. కీలక గడ్డిమందుపై కేంద్రం నిషేధం
- అత్యంత ప్రమాదకర పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్రం నిషేధం
- మనుషులు, జంతువుల ఆరోగ్యానికి ప్రమాదకరమని వెల్లడి
- నిషేధ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం
- ఈ విషానికి విరుగుడు లేకపోవడమే ప్రధాన ఆందోళన
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు సంహారకాల్లో (హెర్బిసైడ్) ఒకటైన పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మానవులు, మూగజీవాల ఆరోగ్యానికి ఇది తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని నిపుణుల కమిటీ నిర్ధారించడంతో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పారాక్వాట్‌ను నియంత్రించిన సుమారు 70 దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయింది.
ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్, 1968 నిబంధనల ప్రకారం, నిపుణుల కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీల సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా ఆదేశాల ప్రకారం పారాక్వాట్ డైక్లోరైడ్‌కు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సదరు సర్టిఫికెట్లను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని, ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిషేధాజ్ఞలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది.
ఎందుకీ నిషేధం?
పారాక్వాట్ డైక్లోరైడ్ అత్యంత విషపూరితమైన రసాయనం. దీనిని స్వల్ప మోతాదులో తీసుకున్నా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. దీనికి నిర్దిష్టమైన విరుగుడు లేకపోవడం వైద్య రంగలో పెను ఆందోళన కలిగించే అంశం. ఈ రసాయనం ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపి, 'పల్మనరీ ఫైబ్రోసిస్' వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.
ఈ కలుపు సంహారకంపై నిషేధం విధించాలని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, పర్యావరణవేత్తలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, దేశంలో 2024లో పురుగుల మందుల కారణంగా సుమారు 34,000 మంది మరణించారు (వీటిలో ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు ఉన్నాయి). ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.