లీటర్ డీజిల్‌పై రూ.40 వరకు వ్యత్యాసంతో పెరిగిన డిమాండ్.. జియో-బీపీ, నయారా పెట్రోల్ బంకుల కీలక నిర్ణయం
- ప్రైవేట్ బంకుల్లో డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు
- జియో-బీపీ 50 లీటర్లు, నయారా 200 లీటర్ల వరకు పరిమితి
- బల్క్, రిటైల్ డీజిల్ ధరల మధ్య రూ.40 వరకు భారీ తేడా
- చౌక డీజిల్ కోసం బంకులకు క్యూ కడుతున్న పరిశ్రమలు
- ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇదే దారిలో పయనించే అవకాశం
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైల్ సంస్థలు జియో-బీపీ, నయారా ఎనర్జీలు డీజిల్ విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ రిటైల్ అవుట్‌లెట్లలో కొనుగోలు చేసే డీజిల్ పరిమాణంపై ఈ సంస్థలు పరిమితులు విధిస్తున్నాయి. జియో-బీపీ బంకుల్లో ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్ఠంగా 50 లీటర్ల డీజిల్‌ను మాత్రమే విక్రయిస్తుండగా, నయారా ఎనర్జీలో ఈ పరిమితి 70 నుంచి 200 లీటర్ల మధ్య ఉంది. సాధారణ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కంపెనీలు వెల్లడించాయి.
ఈ ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే. ప్రస్తుతం లీటర్ డీజిల్‌పై ఈ ధరల తేడా సుమారు రూ. 40 వరకు ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్ల వద్ద ఉన్నప్పటికీ, గడిచిన మే నెల నుంచి దేశీయ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటి బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెరిగాయి. దీంతో రిటైల్ బంకుల్లో లభించే డీజిల్ వారికి అత్యంత చౌకగా మారింది.
ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీలు, టెలికాం కంపెనీలు, హోటళ్లు, మాల్స్, డేటా సెంటర్లు, ఆసుపత్రులు వంటి బల్క్ వినియోగదారులు తమకు అవసరమైన డీజిల్‌ను నేరుగా రిటైల్ బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి 400 నుంచి 600 లీటర్ల వరకు భారీ పరిమాణంలో డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో బంకుల వద్ద నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇది సాధారణ వాహనదారులకు ఇంధన కొరత ఏర్పడే ప్రమాదానికి దారితీస్తోంది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులందరికీ సమానంగా ఇంధనాన్ని అందుబాటులో ఉంచేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జియో-బీపీ ఒక ప్రకటనలో తెలిపింది.