రైలు బోగీలో మూత్రవిసర్జన.. ప్రయాణికుడికి దేహశుద్ధి

రైలు బోగీలో మూత్రవిసర్జన.. ప్రయాణికుడికి దేహశుద్ధి

Railway passenger thrashed for urinating inside train coach
  • రద్దీగా ఉన్న రైలు కోచ్‌లో మూత్రవిసర్జన చేసిన వ్యక్తి
  • అడ్డుకున్న ప్రయాణికులతో వాగ్వాదానికి దిగిన యువకుడు
  • చెంపదెబ్బ కొట్టి, మూత్రాన్ని శుభ్రం చేయించిన తోటి ప్రయాణికులు
  • వైరల్ అయిన వీడియో.. స్పందించిన రైల్వే సేవా
  • ఘటనపై వివరాలు అందించాలని కోరిన అధికారులు
రద్దీగా ఉన్న రైలు బోగీలో ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, ఆగ్రహించిన తోటి ప్రయాణికులు అతడికి దేహశుద్ధి చేసి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రైల్వే శాఖ స్పందించింది.

వివరాల్లోకి వెళితే, ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ రైలు జనరల్ కోచ్‌లో ఓ వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లకుండా బోగీలోనే మూత్ర విసర్జన చేశాడు. అక్కడ మహిళలు, పిల్లలు ఉన్నారని, టాయిలెట్ ఉపయోగించాలని తోటి ప్రయాణికులు సూచించినా అతడు బేఖాతరు చేశాడు. పైగా వారితో వాగ్వాదానికి దిగి, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించాడు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ప్రయాణికుడు అతడి కాలర్ పట్టుకుని దేహశుద్ధి చేశాడు. మిగతా ప్రయాణికులు కూడా అతడి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అనంతరం అందరూ కలిసి అతడితోనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు. ఈ దృశ్యాలను ఎవరో మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

ఈ వైరల్ 'రైల్వే సేవా' స్పందించింది. వీడియోను షేర్ చేసిన వ్యక్తిని ట్యాగ్ చేస్తూ, తదుపరి చర్యల కోసం రైలు నంబర్, ప్రయాణ వివరాలను అందించాలని కోరింది. అయితే ఈ ఘటన ఏ రైలులో, ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సదరు వ్యక్తి తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisement
Indian Railways
Viral Video
Train Urination Incident
Railway Seva
Passenger Thrashed
General Coach

More Telugu News