హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ ఘాతుకం.. క్యాబ్ ఎక్కిన మహిళపై లైంగిక దాడికి యత్నం

హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ ఘాతుకం.. క్యాబ్ ఎక్కిన మహిళపై లైంగిక దాడికి యత్నం

Cab driver atrocity in Hyderabad sexual assault attempt on woman passenger
  • దిశ ఘటన జరిగిన ప్రాంతంలోనే మరో దారుణ ఘటన
  • కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నం
  • రూ. 60 వేల నగదు ఉన్న బ్యాగుతో పరారైన నిందితుడు
  • కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్ శంషాబాద్‌లో తీవ్ర కలకలం రేగింది. 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన జరిగిన ప్రాంతం సమీపంలోనే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన బాధితురాలు శంషాబాద్ వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది. అయితే, తోండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే డ్రైవర్ కారును దారి మళ్లించాడు. సమీపంలోని కొత్వాల్‌గూడ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

అప్రమత్తమైన బాధితురాలు వెంటనే కారులోంచి బయటకు దూకి గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిపోయిన డ్రైవర్, ఆమె వద్ద ఉన్న రూ. 60,000 నగదు గల బ్యాగును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

అనంతరం బాధితురాలు శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement
Cab Driver
Hyderabad
Shamshabad
Sexual Assault Attempt
RGIA Police
Women Safety

More Telugu News