ఫేస్‌బుక్‌లో మహిళతో పరిచయం... రూ.14.61 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ డాక్టర్!
- హైదరాబాద్ వైద్యుడిని మోసం చేసిన ఫేస్‌బుక్ స్నేహితురాలు
- నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పేరుతో భారీ మోసం
- విడతలవారీగా రూ.14.61 కోట్లు బదిలీ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు
- విత్‌డ్రాకు ప్రయత్నించగా ట్యాక్స్ పేరుతో మరో రూ.7.5 కోట్లు డిమాండ్
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు, 40 ఖాతాలకు డబ్బు మళ్లింపు
ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ మాయమాటలు నమ్మి, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టిన ఓ దంత వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని జరిగిన అతిపెద్ద సైబర్ మోసాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది. బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)ని ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల దంత వైద్యుడికి ఆగస్టు 27న ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘మోనికా మాధవ్’ అనే పేరుతో ఒక మహిళ పరిచయమైంది. తాను చెన్నైకి చెందిన దానినని, విడాకుల ప్రక్రియలో ఉన్నానంటూ సానుభూతి పొందింది. ఆ తర్వాత తనను టెలిగ్రామ్‌లో సంప్రదించాలని కోరి, తాను ట్రేడింగ్ ద్వారా రోజూ రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నట్లు నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన వైద్యుడితో cmcmarketsltd.com అనే నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో ఖాతా తెరిపించి, ఆధార్ వివరాలు అప్‌లోడ్ చేయించింది.
నమ్మకం కుదిర్చేందుకు, సెప్టెంబర్ 3న వైద్యుడు పెట్టిన రూ.30 లక్షల పెట్టుబడికి రూ.8.6 లక్షలు లాభం వచ్చినట్లు సైట్‌లో చూపించారు. అందులో నుంచి రూ.85,000 విత్‌డ్రా చేసుకునేందుకు కూడా అనుమతించడంతో అతనికి అనుమానం రాలేదు. ఇదే అదనుగా, ఇద్దరం కలిసి రూ.10 కోట్లు పెట్టుబడి పెడదామని ఆమె ప్రతిపాదించింది. దీంతో వైద్యుడు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు, అప్పులు చేసి విడతల వారీగా మొత్తం రూ.14.51 కోట్లు డిపాజిట్ చేశాడు. ఆయన ఖాతాలో మొత్తం లాభం రూ.34 కోట్లు ఉన్నట్లు సైట్‌లో కనిపించింది.
ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ఆప్షన్ పనిచేయలేదు. డబ్బు రావాలంటే పన్నుల కింద రూ.7.5 కోట్లు చెల్లించాలని సైబర్ కేటుగాళ్లు డిమాండ్ చేశారు. అదే సమయంలో మోనికా తన కాంటాక్ట్‌లను బ్లాక్ చేసి అదృశ్యమవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66-డీతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితుడు 91 సార్లు డబ్బు బదిలీ చేసినట్లు, ఆ మొత్తం 10 రాష్ట్రాల్లోని 40 బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీజీసీఎస్‌బీ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.