ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సందడి.. 'ది ప్యారడైజ్' వీక్షించిన కేటీఆర్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సందడి.. 'ది ప్యారడైజ్' వీక్షించిన కేటీఆర్

KTR watches The Paradise movie at RTC X Roads Sudarshan Theatre
  • హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సందడి
  • మాజీ మంత్రులు, ఎంపీతో కలిసి సినిమా చూసిన కేటీఆర్ 
  • చాలా కాలం తర్వాత థియేటర్‌కు వెళ్తున్నట్లు ముందుగా ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) చాలా కాలం తర్వాత ఒక థియేటర్‌లో సందడి చేశారు. ఆయన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్‌లో నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

సినిమాకు వెళ్లే ముందు కేటీఆర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. "చాలా సంవత్సరాల తర్వాత థియేటర్‌కు వెళుతున్నాను. నాకు ఇష్టమైన నటులలో ఒకరైన నాని, ప్రతిభావంతులైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలల 'ది ప్యారడైజ్' చూడటానికి వెళుతున్నా" అని ఆయన పేర్కొన్నారు. 

కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ సినిమాను చూశారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' ఒక పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో నాని, మోహన్ బాబు, క‌యాదు లోహర్, సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రలు పోషించారు. 

అయితే, ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి పోషించిన 'ఎమ్మెల్యే శంకరన్న' అనే రాజకీయ నాయకుడి పాత్ర, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉందంటూ ప్రేక్షకులు, విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ చిత్రాన్ని వీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
KTR
The Paradise movie
Actor Nani
RTC X Roads
Srikanth Odela
BRS leaders

More Telugu News