మహిళ మార్ఫింగ్ ఫొటోలు.. సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- ప్రధానితో మహిళ ఫొటోను మార్ఫింగ్ చేశారని ఆరోపణలు
- అభ్యంతరకర చిత్రాలను 24 గంటల్లో తొలగించాలని మెటాకు ఆదేశం
- కాక్రోచ్ జనతా పార్టీ నలుగురు నేతలకు నోటీసులు జారీ
- బాధిత మహిళకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఉత్తర్వులు
- ఇది ప్రధానికి సంబంధించిన విషయమన్న న్యాయస్థానం
ఒక మహిళకు సంబంధించిన అభ్యంతరకర మార్ఫింగ్ చిత్రాల వివాదంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ ఫొటోలను, వాటికి సంబంధించిన లింకులను 24 గంటల్లోగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని మెటా సంస్థను శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, రత్న సింగ్‌లకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసనల సందర్భంగా తన ఫొటోను మార్ఫింగ్ చేశారని బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏఐ, ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన చిత్రాన్ని అసభ్యకరంగా మార్చారని, వాటిని బ్యానర్లు, పోస్టర్లపై ప్రదర్శించారని ఆమె ఆరోపించారు. ఈ ఫొటోలతో కూడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేయడంతో పాటు, తనపై అసభ్యకర నినాదాలు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ గిరీష్ కత్‌పాలియా కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది కేవలం ఒక మహిళకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దేశ ప్రధానమంత్రికి కూడా సంబంధించినది. వారు సున్నితంగా వ్యవహరించకపోతే, పరిస్థితిని ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు" అని ఆయన హెచ్చరించారు. బాధితురాలికి పూర్తిస్థాయి పోలీస్ భద్రత కల్పించాలని ఆదేశించిన న్యాయస్థానం, రెండు వారాల్లోగా ఈ కేసుపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
బాధితురాలు తన ఫిర్యాదులో సీజేపీ నేతల పేర్లను స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. జూన్ 20న ప్రారంభమైన సీజేపీ నిరసనలు, ఒక కేంద్ర మంత్రి రాజీనామాతో జులై 25న ముగిశాయి.