‘ఎవరినీ వెనకేసుకురాను’.. ఎన్నికల సంఘంపై విమర్శల పట్ల కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
- ప్రభుత్వంలో ఉన్నానని ఎవరినీ సమర్థించబోనని వ్యాఖ్య
- ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయాల్లో సహజమన్న కేంద్ర మంత్రి
- ప్రజలకు ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని సూచన
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు
ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ప్రభుత్వంలో ఉన్నానని ఎవరికీ మద్దతుగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని చెప్పారు. ఆ సంస్థపై ప్రశ్నలు వస్తున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని, ముఖ్యంగా సీఈసీదేనని అన్నారు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణల గురించి తాను పెద్దగా పట్టించుకోనని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల రాజకీయ విధానంలో భాగమన్నారు. అయితే ప్రతిపక్షాలను సంతృప్తిపరిచేందుకు ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలకు విషయాలను వివరించి.. వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. అదే ప్రజాస్వామ్య గొప్పతనమని పేర్కొన్నారు.
మరోవైపు బీహార్‌లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పాట్నాలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రామ్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది.
సచివాలయ పోలీస్ స్టేషన్ గేటు సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. బారికేడ్ల వద్దే కార్యకర్తలు నిరసన కొనసాగించారు.