వరంగల్ విమానాశ్రయానికి ‘రాణి రుద్రమ’.. ఆదిలాబాద్‌కు ‘కొమరం భీం’ పేర్లు!
- వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు
- ప్రభుత్వ నిర్ణయానికి త్వరలో కేబినెట్ ఆమోదముద్ర
- ఎయిర్‌పోర్టుల డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి
- చరిత్ర ఉట్టిపడేలా కొత్త డిజైన్లు రూపొందించాలని ఆదేశం
వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు కాకతీయ రాణి రుద్రమదేవి పేరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఫైలును కేబినెట్ సమావేశం ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ పేర్లపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాలకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టిన తరహాలోనే, తెలంగాణ చారిత్రక వైభవాన్ని, వీరుల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే, ఈ పేర్లను ఖరారు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ పంపనున్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే, మామునూరు ఎయిర్‌పోర్టుకు సమ్మక్క-సారలమ్మ పేరు కూడా పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
డిజైన్లపై సీఎం అసంతృప్తి
ఇదే సమీక్షలో విమానాశ్రయాల డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులు చూపిన డిజైన్లను చూసి "ఇవి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డిజైన్లా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో చేసినవా?" అని ప్రశ్నించినట్లు తెలిసింది. విమానాశ్రయాల నిర్మాణం అద్భుతంగా, తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా ఉండాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం సూచనల మేరకు అధికారులు ఇప్పుడు కొత్త డిజైన్లను సిద్ధం చేసే పనిలో పడ్డారు. త్వరలోనే తుది డిజైన్లను మళ్లీ సీఎంకు సమర్పించనున్నారు.