టూరిజం సమ్మిట్ లో 'చరైవేతి.. చరైవేతి' శ్లోకాన్ని ఉటంకించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

టూరిజం సమ్మిట్ లో 'చరైవేతి.. చరైవేతి' శ్లోకాన్ని ఉటంకించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

Gajendra Singh Shekhawat quotes Charaiveti Charaiveti shloka at Tourism Summit
  • 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే మన లక్ష్యమన్న షెకావత్
  • పర్యాటక అనుకూల విధానాలను వివరించిన కేంద్ర మంత్రి
  • పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు విశేషంగా పెరుగుతున్నాయని వెల్లడి

న్యూఢిల్లీలో నిర్వహించిన 'WION ఐకానిక్ టూరిజం సమ్మిట్'లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ప్రసిద్ధ వైదిక మంత్రం 'చరైవేతి.. చరైవేతి' (ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూనే ఉండు) శ్లోకాన్ని ఉటంకిస్తూ... పర్యాటకరంగం నిరంతర పురోగతికి, దేశ ఆర్థిక రంగానికి ఎలా చోదకశక్తిగా మారుతుందో వివరించారు. భారతదేశం వేగంగా పురోగమిస్తోందని, 2047 నాటికి 'వికసిత భారత్' (అభివృద్ధి చెందిన భారత్) సాధించడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు.


గ్లోబల్ పర్యాటక పటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల కల్పన, సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణ, పర్యాటక అనుకూల విధానాలను కేంద్ర మంత్రి వివరించారు. దేశంలో ఆధ్యాత్మిక, పర్యావరణ (ఎకో టూరిజం), వైద్య పర్యాటక రంగాలు విపరీతమైన వృద్ధి నమోదు చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు విశేషంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Gajendra Singh Shekhawat
WION Iconic Tourism Summit
Indian Tourism Sector
Viksit Bharat 2047
Charaiveti Charaiveti shloka
Tourism Minister speech

More Telugu News