తెలంగాణకు కర్ణాటక సీఎం గుడ్ న్యూస్... జూరాలకు నీటి విడుదలకు ఓకే

తెలంగాణకు కర్ణాటక సీఎం గుడ్ న్యూస్... జూరాలకు నీటి విడుదలకు ఓకే

Karnataka CM Good News to Telangana OK for Jurala Water Release
  • జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకారం
  • విడతల వారీగా 3 టీఎంసీలు ఇచ్చేందుకు సీఎం డీకే శివకుమార్ సుముఖత
  • బెంగళూరులో కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల బృందం భేటీ
  • జూరాల కింద రైతుల ఇబ్బందులను వివరించిన మంత్రులు జూపల్లి, శ్రీహరి
తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. విడతల వారీగా 3 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు భారీ ఊరట లభించినట్లయింది.

ఈ మేరకు బుధవారం తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశమైంది. జూరాల ప్రాజెక్టు కింద నీటి అవసరాలను, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వారు ఆయనకు వివరించారు.

తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిని పరిశీలించిన డీకే శివకుమార్, అధికారులతో చర్చించిన అనంతరం జూరాలకు నీటిని విడుదల చేసేందుకు అంగీకరించారు. దీంతో జూరాల ఆయకట్టు కింద ఎండిపోతున్న పంటలకు జీవం పోసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కర్ణాటక సానుకూలంగా స్పందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
DK Shivakumar
Jurala Project
Telangana Water Release
Mahabubnagar Farmers
Jupally Krishna Rao

More Telugu News