‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!

‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!

Donald Trump gives new name to AI says it should be called Super Intelligence
  • ఏఐకి బదులు ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ అని పిలవాలన్న ట్రంప్‌
  • ఆర్టిఫిషియల్‌ అంటే నకిలీ అనే భావన వస్తోందని వ్యాఖ్య
  • అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’నే కొనసాగిస్తామని ప్రకటన
  • ఇతర దేశాలు కూడా ఇదే అనుసరించాలని సూచన
  • ఏఐపై నియంత్రణకు నో చెప్పిన ట్రంప్‌
కృత్రిమ మేధస్సు (ఏఐ)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త పేరు పెట్టారు. ఇకపై ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’కు బదులుగా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ (ఎస్‌ఐ) అనే పదాన్ని వాడాలని నిర్ణయించారు. ‘ఆర్టిఫిషియల్‌’ అంటే నకిలీ అన్న భావన వస్తోందని.. ఈ సాంకేతికత నిజమైనదే కాబట్టి ఆ పేరు సరైంది కాదని ట్రంప్‌ అన్నారు.

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ అనే పదమే కనిపిస్తుందని చెప్పారు. ఇతర దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఏఐపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ తీసుకురావాలన్న ప్రయత్నాలను ట్రంప్‌ వ్యతిరేకించారు. సాంకేతికత అభివృద్ధిని అడ్డుకునే అంతర్జాతీయ వ్యవస్థను అమెరికా అంగీకరించబోదని స్పష్టం చేశారు. అయితే ఏఐతో కొత్త సవాళ్లు వస్తాయని చెప్పారు. అవసరమైనప్పుడు న్యాయశాఖ, చట్టాన్ని అమలు చేసే ఇతర సంస్థలు చర్యలు తీసుకుంటాయని తెలిపారు.

అత్యాధునిక ఏఐ, రోబోలు మానవాళికి పెను ముప్పుగా మారొచ్చన్న హెచ్చరికలను ట్రంప్‌ కొట్టిపారేశారు. ఏఐ భవిష్యత్తులో పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్‌ కంటే పెద్ద మార్పు తీసుకురావచ్చని అన్నారు. ఈ సాంకేతికత అభివృద్ధిని అడ్డుకునే చర్యలు తీసుకోబోమని చెప్పారు.

ఏఐలో ఏ దేశం ముందుంటే దానిదే ప్రపంచంలో పైచేయి అవుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రస్తుతం చైనా కంటే చాలా ముందుందని అన్నారు. ఈ ఆధిక్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అయితే ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ అనే పేరును అన్ని ఏఐ వ్యవస్థలకు వాడతారా? అత్యాధునిక మోడళ్లకు మాత్రమే పరిమితం చేస్తారా? అన్నది ట్రంప్‌ స్పష్టంగా చెప్పలేదు. ప్రభుత్వ శాఖల్లో ఈ మార్పు ఎలా అమలవుతుందన్నదానిపైనా వివరాలు వెల్లడించలేదు.
Advertisement
Donald Trump
Super Intelligence
Artificial Intelligence
UN General Assembly
US China AI competition
AI technology news

More Telugu News