తాగునీటిని వృథా చేస్తే రూ.20,000 ఫైన్.. హైదరాబాద్‌లో కఠిన నిబంధనలు
- హైదరాబాద్‌లో నీటి వృథాపై జలమండలి కఠిన చర్యలు
- జూబ్లీహిల్స్‌లో ఐదుగురు వినియోగదారులకు జరిమానా
- రూ.1,000 నుంచి రూ.20,000 వరకు ఫైన్లు, కనెక్షన్ కట్ హెచ్చరిక
- లీకేజీలపై 24 గంటల్లో స్పందించాలని సిబ్బందికి ఆదేశాలు
- జలాశయాల్లో నీటి కొరతతోనే కఠిన నిబంధనల అమలు
నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోమవారం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు, తాగునీటిని వాహనాలు కడగడానికి, ఫ్లోర్‌లు శుభ్రం చేయడానికి వాడుతున్న ఐదుగురు వినియోగదారులకు జరిమానాలు విధించారు. ట్యాంకులు నిండి పొంగిపోతున్నా, నల్లాలు వదిలేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రారంభంలో అవగాహన కార్యక్రమాలు, హెచ్చరికలతో సరిపెట్టిన జలమండలి, మార్పు రాకపోవడంతో జరిమానాలను భారీగా పెంచింది. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి రూ.1,000 నుంచి రూ.5,000, రూ.10,000, గరిష్ఠంగా రూ.20,000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. పదేపదే నీటిని వృథా చేసేవారి నల్లా కనెక్షన్లను శాశ్వతంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం. 23లో ఫ్లోర్ క్లీనింగ్‌కు తాగునీరు వాడుతున్న పూర్ణిమ అనే వినియోగదారురాలికి రూ.20,000 జరిమానా విధించడం గమనార్హం.
ఈ తనిఖీలను నగరం అంతటా విస్తరిస్తున్నారు. సోమవారం సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఎస్కే నగర్‌లో అక్రమంగా మోటార్ వాడుతున్నందుకు ఒకరికి రూ.5,000, అల్కాపురి యాదవ్ నగర్‌లో తాగునీటితో ఫ్లోర్ కడుగుతున్నందుకు మరొకరికి రూ.1,000 ఫైన్ వేశారు.
నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్, ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, మంజీరా-సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడం వల్లే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. "ఈరోజు మనం వృథా చేసే ప్రతీ నీటి చుక్క, రేపు మరొకరి దాహార్తిని తీర్చగలదు" అని బోర్డు పేర్కొంది.
అదే సమయంలో తమ సిబ్బందికి కూడా జలమండలి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని 15,000 కిలోమీటర్ల పైప్‌లైన్లలో ఎక్కడైనా లీకేజీ ఫిర్యాదు వస్తే 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చూపాలని, తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకునే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. నీటి దుర్వినియోగంపై ప్రజలు 99499 30003 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని బోర్డు సూచించింది. నీటి సంరక్షణ అనేది వినియోగదారులు, జలమండలి ఉమ్మడి బాధ్యత అని పేర్కొంది.